| Daily భారత్
Logo




బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

News

Posted on 2026-06-02 16:18:35

Share: Share


బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి

 వికలాంగుడైన బాలునికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి 

బాలుని విద్యా, వైద్యం ఖర్చును ప్రభుత్వమే భరించాలి

ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సిపిఐ(ఎం) వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు.

డైలీ భారత్, వైరా: బాలుని వందేళ్ల భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వికలాంగుడైన బాలుడు తలపంటి రుద్రాన్ష్  కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, బాలుని విద్యా, వైద్యం ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సిపిఐ(ఎం) వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వికలాంగుడిగా మారిన వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపంటి సత్యకాంత్, రేణుక దంపతుల కుమారుడు రుద్రంష్ కుటుంబాన్ని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సిపిఐ(ఎం) వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, ఐద్వా వైరా రూరల్ మండలం అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చిన బాలుడికి కాన్యులా అమర్చిన ప్రాంతంలో వాపు వచ్చిందని కుటుంబ సభ్యులు పలుమార్లు వైద్యులకు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన బాలుడి ఎడవ చేయ్యి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రాణాలు పోసే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన పసికందు వికలాంగుడిగా మారడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించడం తోపాటు, బాలునికి ఉచితంగా విద్యా, వైద్యం, కృత్రిమ అవయవాలు అందించాలని కోరారు. ప్రభుత్వ వైద్య సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించాలని సిపిఐ(ఎం), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >