| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

News

Posted on 2026-06-02 20:33:53

Share: Share


రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా ట్యాబులను పంపిణీ చేశారు..రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కానుకను అందించడం ఎంతో సంతోషకరమని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ఎనిమిది చోట్ల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని, తన ఆలోచన, కల కేవలం ఈ ఎనిమిది పాఠశాలలకే పరిమితం కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు...

గతంలో కూడా జిల్లాలో దాదాపు 6 వేల మంది విద్యార్థులకు ఐపాడ్లను అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఉన్నత లక్ష్యాలు, గొప్ప భవిష్యత్తు

విద్యార్థులు కేవలం పదవ తరగతితోనే ఆగిపోకుండా, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. అటువంటి ఉన్నత లక్ష్యాలను చేరుకునే విద్యార్థుల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. పిల్లలు చదువులో రాణించి ఉన్నత స్థానాల్లో ఉంటే, ఆ సంతోషం తల్లిదండ్రులకు మించినది మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >