| Daily భారత్
Logo




హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

News

Posted on 2026-06-02 20:47:41

Share: Share


హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా పిఆర్టియు ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని పిఆర్టియు భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అపోహలు వద్దని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు కామారెడ్డి  పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండదని తెలిపారు. ఈ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి 1.5 శాతం కోత విధించారని, ముందస్తు సమాచారం లేకుండా వేతనం కట్ కావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. హెల్త్ కార్డ్ స్కీమ్ అమల్లోకి వస్తే కోత విధించినా ఎలాంటి ఇబ్బంది లేదని, విధివిధానాలు లేకపోవడం, ట్రస్ట్ ఏర్పాటు కాకముందే 1.5 శాతం కట్ కావడంతో గందరగోళం ఏర్పడిందని వివరించారు.

ఇటీవల సీఎస్ రామకృష్ణారావుతో జరిగిన సమావేశంలో ట్రస్ట్ ఏర్పాటుకు 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారని వెల్లడించారు.

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒక్కరి నుంచే 1.5 శాతం కట్ అవుతుందని, జూన్ 10 నుంచి హెల్త్ కార్డ్ స్కీము ద్వారా నగదు రహిత చికిత్స అమలులోకి వస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కేవలం భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తే, ట్రస్ట్ ద్వారా కుటుంబంలో ఆరుగురికి వర్తిస్తుందని పేర్కొన్నారు. 1.5 శాతం కోత ద్వారా ప్రతి నెల ట్రస్టుకు రూ.44 కోట్లు, ప్రభుత్వం తరఫున మరో రూ.44 కోట్లు జమ అవుతాయన్నారు. ఏడాదికి రూ.1,036 కోట్ల నిధులు ట్రస్ట్లో జమ అవుతాయని పేర్కొన్నారు.  పీఆర్టీయూ 54 సంవత్సరాల క్రితం పీఆర్టీయూ ఏర్పడిందని, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అత్యధికంగా డీఏలు బకాయి పడిందని, ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 3 డీఏలు ఇచ్చిందని అన్నారు. 01.07.2023 నుంచి పీఆర్సీ రావాల్సి ఉందని, అందుకే పీఆర్సీ ముందు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అల్జాపూర్ కుషాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నర్సారెడ్డి, కమిటీ సభ్యుడు గోవర్ధన్, హన్మాండ్లు, రాజు, స్వప్న, విజయ తదితరులు పాల్గొన్నారు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >