Posted on 2026-06-03 15:46:16
డైలీ భారత్, రామంతపూర్: వెంకట సాయి నగర్ కాలనీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి కాలనీ సభ్యులు, టీం సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్. రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాలనీలో సరైన రోడ్లు లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రహదారులు పూర్తిగా బురదమయంగా మారి ప్రజలు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు జారి పడే ప్రమాదం కూడా అధికంగా ఉందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు.
కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్. రెడ్డి సమస్యను సానుకూలంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సీసీ రోడ్ల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు రమేష్ గౌడ్, రవికుమార్, సంజీవ్, ఐలేష్ యాదవ్, రమేష్ యాదవ్, శంకర్, రమేష్ శెట్టి, గోపాల్, సర్వ సత్తయ్య యాదవ్ పాల్గొన్నారు. అలాగే టీం సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, బి. చలపతి రావు,సి.హెచ్. శ్రీనివాస్ గౌడ్, కొల్ల నవీన్ కుమార్, భూపతి నరసింహ, విద్యాసాగర్, రామకృష్ణ, శివ, బాల కొమురయ్య, నరేష్, జగన్, స్వామి, చంద్రం చారి, గణేష్, హుసేన్ తదితరులు హాజరయ్యారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >