| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం

News

Posted on 2026-06-03 21:22:43

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం

చందుర్తి మండలంలో దారుణ ఘటన

మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం

కేసు నమోదు చేసిన ఎస్ఐ జిల్లెల రమేష్

డైలీ భారత్, చందుర్తి: చందుర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అర్థరాత్రి ఇంటికి వచ్చి బెదిరించి తీసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం..బాధితురాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె 14 ఏళ్ల కుమార్తెకు, మానాల గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు గత కొంతకాలంగా ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. నిరంతరం కాల్ చేస్తూ, పెళ్లి చేసుకోవాలని సదరు బాలుడు బాలికపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి 11:40 గంటల సమయంలో, బాధితురాలు తన కుమార్తె మరియు తల్లితో కలిసి నిద్రిస్తుండగా, నిందితుడు మరో బాలుడితో కలిసి ఇంటికి వచ్చాడు. ఫోన్ చేసి బయటకు రాకపోతే చంపేస్తామని బెదిరించడంతో, భయపడిన బాలిక ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లింది.నిందితులు ఆమెను సమీపంలోని ఒక గుడిసె వద్దకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం నల్లటి హోండా యాక్టివా వాహనంపై అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు...

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >