| Daily భారత్
Logo




వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

News

Posted on 2026-06-03 21:25:37

Share: Share


వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ లో మూడవ బ్రిడ్జి స్లాబ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.వారు మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో , జిల్లా మంత్రుల సహకారంతో , జిల్లా అధికారుల సమన్వయంతో రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం అన్నారు. ఇప్పటికే 150 కోట్లు విడుదల చేసుకొని రాజన్న ఆలయ అభివృద్ధి పనులను శిరవేయంగా కొనసాగుతున్నాయని అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో  అభివృద్ధి శిలాఫలకలకే పరిమితమై వారిచ్చిన వాగ్దానాలన్నీ నీటి మూటలు అయ్యాయని అన్నారు.. 2015 లో మూడో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేయడం మరిచిపోయారని ఎద్దేవ చేశారు.. కనీసం భూసేకరణ చేయకుండా వారు కేవలం వారు ప్రజలను మభ్య పెట్టారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో బ్రిడ్జి భూసేకరణ కోసం 6 కోట్ల 97 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు... గత ప్రభుత్వం హయంలో వారు కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే శిలాఫలకాలు వేశారని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కాదన్నారు. దానికి సజీవ సాక్షాలుగా తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులకు భూసేకరణ చేయకుండా కేవలం శిలాఫలకాలే వేశారని తెలిపారు.. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజా ప్రభుత్వంలో భూసేకరణకు నిధులు విడుదల చేసి భూ సేకరణ చేయడం జరిగిందన్నారు... ఇప్పటికి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి అన్నారు.రాజన్న ఆలయం ముందు నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు..బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >