| Daily భారత్
Logo




దారుణం.. భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త

News

Posted on 2026-06-04 19:02:54

Share: Share


దారుణం.. భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త

డైలీ భారత్, హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘ‌ట‌న‌ వెలుగుచూసింది. ఖైతలాపూర్‌లోని డబుల్ బెడ్ రూమ్స్ ప్రాంతంలో ఓ భర్త తన భార్యను దారుణంగా గొంతు కోసి హత‌మార్చాడు. వివ‌రాళ్లోకేళితే.. రహీమ్, సుమేరా దంపతులకు 2024లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. వృత్తిరీత్యా రహీమ్ ఆటో డ్రైవ‌ర్‌. ర‌హీమ్‌కు, అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున కూడా దంప‌తులిరువురి మధ్య గొడవ జరిగింది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన రహీమ్.. భార్య సుమేరా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపైన కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని విష‌యాలు తెలియాల్సివుంది.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >