Posted on 2026-06-05 21:46:24
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS నిర్వహించారు.
ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించి కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైటీసీ, పాలిటెక్నిక్ తదితర సాంకేతిక విద్యా కోర్సులపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొత్త కోర్సుల వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
TG-iPASS ద్వారా అందిన 50 దరఖాస్తుల్లో 39 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు సమీక్షించి, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే SC, ST పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, MSME అభివృద్ధి, స్థానిక వనరుల ఆధారిత పరిశ్రమలు, ఉద్యోగ మేళాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఎల్‌డీఎం రామిరెడ్డి, మెప్మా పీడీ రాజేష్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
#IndustrialDevelopment #TGiPASS #MSME #Employment #SkillDevelopment #BhadradriKothagudem #PrajaPalana #telangana
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >