| Daily భారత్
Logo




వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

News

Posted on 2026-06-06 16:50:07

Share: Share


వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ లోని రామంతపూర్ భగయత్ వెంకట సాయి నగర్ కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల న   మంజూరు చేయాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి కాలనీ సభ్యులు టీం సభ్యుల తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కాలనీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన విజయేందర్ రెడ్డి కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడం వల్ల రానున్న వర్షాకాలంలో మట్టి రోడ్లు పూర్తిగా బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు నిత్యావసర పనుల కోసం రాకపోకలు సాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు.

అంతేకాకుండా వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి ప్రజారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు.  వెంటనే పరిపాలనా అనుమతులు , నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యేను కోరారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ. వెంకట సాయి నగర్ కాలనీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, సీసీ రోడ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి నిధులు మంజూరు చేయించేలా  ప్రత్యేకంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులు రమేష్ గౌడ్,  రవికుమార్,  సంజీవ, ఐలేష్ యాదవ్ , రమేష్ యాదవ్,శంకర్ ,రమేష్ శెట్టి, గోపాల్ , సర్వ సత్తయ్య యాదవ్,టీం సభ్యులు ఆర్. గోవింద్, జి.అశోక్, సి హెచ్ శ్రీనివాస్ గౌడ్, కొల్ల నవీన్ కుమార్, భూపతి నరసింహ, విద్యాసాగర్ , బి చలపతి రావు, రామకృష్ణ, శివ, బాల కొమురయ్య,  నరేష్,  స్వామి, చంద్రం చారి , గణేష్ , హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >