Posted on 2026-06-06 16:51:52
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ నిర్వహించారు. ఎన్జీవోస్ కాలనీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆవరణలో ప్రత్యేక వార్డ్ సభ నిర్వహించారు. 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశేట్టి హర్షిత మాట్లాడుతు... వర్షాకాలం నేపథ్యంలో నీటి నిల్వ లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఘన వ్యర్దాల నిర్వహణకు పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా చేసి చెత్త బండిలో వేయాలని కోరారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినట్లుయితే భూగర్భ జలాలు పెరుగుతాయని, దీని వల్ల నీటి ఎద్దడి సమస్య ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎ. ఈ వేణు ప్రసాద్, వార్డ్ ఆఫీసర్ వినయ్, డీసీసీ ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణ హరి, వార్డ్ పెద్దలు గంగారాం, కృష్ణ రెడ్డి, శర్మ సర్, మెహర్ బాబా గౌడ్, రాజగౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >