Posted on 2026-06-10 07:46:43
జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్ శ్రీనివాస్ కి వినతిపత్రం
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నడుస్తున్న స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి , భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ టిడబ్ల్యుఎఫ్ - సీఐటీయూ) ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడు వై విక్రమ్ , కార్యదర్శి జిల్లా ఉపేందర్ లు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీవో జిల్లా కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో విద్యార్థులు మరియు సాధారణ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని స్కూల్ బస్సులు , ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించాలని కోరారు . వాహనాల బ్రేకులు , టైర్లు , అత్యవసర ద్వారాలు , ఫస్ట్ ఎయిడ్ బాక్స్ , ఫైర్ ఎక్స్టింగ్విషర్ , బీమా పత్రాలు , అనుమతులు మరియు ఇతర భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు . ప్రమాదాలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు . ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జరుపుల ప్రమీల , మధు , టి. రాంబాబు లు పాల్గొన్నారు . అలాగే యూనియన్ నాయకులు ఏఐఆర్ టిడబ్ల్యుఎఫ్ - సీఐటీయూ ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ల యూనియన్ జిల్లా నాయకులు శ్రీనివాస్ , నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >