| Daily భారత్
Logo




అందుబాటులో ఉండాలి.. వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-06-11 18:49:50

Share: Share


అందుబాటులో ఉండాలి.. వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల సుందరయ్య నగర్ అర్బన్ పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ.

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల సుందరయ్య నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్ సీ)లో జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. ఏఎన్సీ నమోదు, ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టులపై ఆరా తీశారు. వ్యాక్సిన్ గది, మందులు పరిశీలించారు. 

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు, చికిత్స పొందేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని పేర్కొన్నారు. సబ్ సెంటర్ లలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎన్ సీడీ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >