| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

News

Posted on 2026-06-11 20:54:40

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

చోరీకి సంబంధించిన సొత్తు కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీ సొత్తు కొనుగోలు మరియు విక్రయాలను అరికట్టేడమే లక్ష్యంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని  స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

ఈతనిఖీల్లో భాగంగా స్క్రాప్ దుకాణాల యజమానులు కొనుగోలు చేస్తున్న వస్తువులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, కొనుగోలుదారుల వివరాలను పరిశీలించి , అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, చోరీ సొత్తు కొనుగోలు చేయవద్దని, ప్రతి వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.

తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం, సర్వీస్ వైర్ కట్టలు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మోటార్లు, 03 కాపర్ వైర్ బెండలు దొరుకగా, విటికి సంబంధించి సరైన ఆధారాలు,పత్రాలు సమర్పించలేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.అనంతరం సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా కొనుగోలు, విక్రయాల రిజిస్టర్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు కూడా చోరీ సొత్తు కొనుగోలు, విక్రయాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >