| Daily భారత్
Logo




భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

News

Posted on 2026-06-12 07:31:47

Share: Share


భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు రాత్రి సుమారు 12.30 గంటల నుండి 5.00 గంటల వరకు భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానిత వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల ధ్యేయంగా సోదాలు చేపట్టామని డిఎస్పి అరుణ్ కుమార్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని మొత్తం 62 లాడ్జిలతో పాటు స్థానిక బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఫింగర్ ప్రింట్ డివైస్లులు, డాగ్ స్క్వాడ్ బృందాలతో లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో లాడ్జిల్లా యజమానులు, మేనేజర్లు, సిబ్బంది యొక్క పూర్తి వివరాలు సేకరించి, లాడ్జిలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ కనీసం 2 నెలల పాటు బ్యాకప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, లాడ్జి వెలుపల రహదారిపై వచ్చి పోయే వాహనాల కదలికలను స్పష్టంగా రికార్డు అయ్యేలా కెమెరాలను రోడ్డు వైపు అమర్చాలని ఆదేశించారు. పట్టణ ప్రజల భద్రత దృష్ట్య  ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించినట్లయితే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >