Posted on 2026-06-12 11:16:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని చేనేత కళాకారుడు వెల్డి హరిప్రసాద్ హ్యూండ్లూమ్స్ ను నిజామాబాద్ లోని ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు బుధవారం సందర్శించారు. దారం నుంచి వస్త్రాం ఎలా తయారు చేస్తారన్న ప్రాసెస్ ను హరిప్రసాద్ వారికి వివరించారు. చేనేత కళాకారులు సాధారణ దారం నుంచి రంగు రంగుల డిజైన్ల చీరలను తయారు చేసే విధానాన్ని విద్యార్థులకి ప్రాక్టికల్ గా చూపించారు. అదే విధంగా హరిప్రసాద్ తయారు చేసిన అగ్గిపెట్టెలో చీర, ఉంగరం, సూది లో నుంచి దూరే చీరల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గురించి కూడా విద్యార్థులకు హరిప్రసాద్ వివరించారు. సిరిసిల్ల పర్యటన తమకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పారు. భవిష్యత్ లో తాము రూపొందించబోయే డిజైన్లకు హరిప్రసాద్ చేసిన సూచనలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సందర్శనలో సిరిసిల్ల వస్త్ర వ్యాపారి ఆడెపు రవీందర్, ప్రొఫెసర్లు మాధురి మదాస్, అక్షర తుంగేన, విద్యార్థులు పాల్గొన్నారు.
#hariprasadhandlooms #fashiondesigners #fashiondesigningstudent #veldihariprasd #weaver #weaving #student #sircillanews #sircillaupdates #sircilla #vairalvideo #vairalpost #trendingpost #trendingreels #trendingvideo #RajannaSiricillaDistrict #nizamabad #rajannasircilla
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >