| Daily భారత్
Logo




బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

News

Posted on 2026-06-20 12:14:40

Share: Share


బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

"ఉత్తరధృవం.. దక్షిణధృవం పాఠం నేర్పి..

ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు."

సర్కారు పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య - ఎస్పీ.

పూర్వపు వృత్తిని గుర్తుచేసుకుని విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను సందర్శించి ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు.. మరో మారు తన పూర్వపు ఉపాధ్యాయ వృత్తిని గుర్తుచేసుకొని ఉత్తరధ్రువం.. దక్షిణధ్రువం.. అంటూ సాంఘికశాస్త్రం పాఠాలను ఎనిమిదోవ తరగతి విద్యార్థులకు బోధించారు. ఎస్పీ చెప్తున్న పాఠాలను విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. 

జూనియర్ అసిస్టెంట్ కు సన్మానం..

తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలనందే తన కుమారుడు రుత్విక్ ను చెప్పించిన జూనియర్ అసిస్టెంట్ హరితను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన అనుభవిజ్ఞులైన నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని పిల్లలకు అర్థమయ్యే రీతిలో సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తారని తెలిపారు. కావున తల్లిదండ్రులు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తెలిపారు.

విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరారు. చెడు అలవాటులకు దూరంగా ఉండాలని మంచి స్నేహితులను మంచి పుస్తకాలను ఎంచుకొని కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యంతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని సర్కారు బడుల ప్రాముఖ్యతను సామర్థ్యాన్ని తెలియజేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమం ఎస్పీ వెంట అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ పట్టణ సిఐ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Image 1

బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-06-20 12:14:40

Readmore >
Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >