| Daily భారత్
Logo




రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

News

Posted on 2026-06-24 17:44:27

Share: Share


రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

ఐటీ కారిడార్‌లో 5 ఎక‌రాల భూమికి హైడ్రా ఫెన్సింగ్‌

డైలీ భారత్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. స‌ర్వే నంబ‌రు 42లో మెట‌ల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాల‌ని కొంత‌మంది ప్ర‌య‌త్నించారు. అక్క‌డ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గ‌దిని కూడా నిర్మించారు. 

5 ఎక‌రాల చుట్టూ రేకుల షీట్ల‌తో ప్ర‌హ‌రీ కూడా నిర్మించే క్ర‌మంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి త‌న‌దిగా చెబుతూ ఎవ‌రినీ అటువైపు రానీయ‌కుండా అడ్డుకుంటున్న ప‌రిస్థితుల్లో శేరిలింగంప‌ల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్డుల‌తో పాటు.. నిర్మించిన గ‌దితో పాటు ఫెన్సింగ్‌ను హైడ్రా తొల‌గించింది. 

మొత్తం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన త‌ర్వాత 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ. వెయ్యికోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >