Posted on 2026-06-24 19:18:46
సుజాతనగర్ లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై రమాదేవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సుజాతనగర్ చెందిన చంద్రగిరి అపర్ణ మహిళ నిన్న రాత్రి సుజాతనగర్లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సుజాతనగర్ పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం మృతురాలి భర్త లక్ష్మీనారాయణ కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా, ఆమె గత కొంతకాలంగా తన ఇద్దరు కుమారులు సాత్విక్ 15 సంవత్సరాలు, లోకేష్ 13 సంవత్సరాలు తో, కలిసి సుజాతనగర్‌లోని సింగభూపాలెం రోడ్‌లో అద్దెకు ఉంటోంది. భర్త లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అపర్ణ పిల్లలు నూడుల్స్ కోసం డబ్బులు అడగడంతో క్షణికావేశంలో వారితో గొడవపడింది. అనంతరం భయపడిన పిల్లలను ఆమె అన్నయ్య కృష్ణ, తల్లి రాజకుమారి తమ ఇంటికి తీసుకువెళ్లారు.
పిల్లలు వెళ్లిపోయారనే మనస్తాపంతో, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అపర్ణ రాత్రి 10:40 గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై మృతురాలి అన్నయ్య బెల్లంకొండ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు (పిటిషన్) మేరకు సుజాతనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సుజాతనగర్ ఎస్సై రమాదేవి వెల్లడించారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >