Posted on 2026-07-10 06:26:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందబాబు నియామకం జరిగింది. భద్రాద్రి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల రమేష్ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్బంగా మంద బాబు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశానని పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని అంటిపెట్టుకొని బి.ఆర్.యస్ నాయకులతో పోరాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చానని. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు నా మీద ఎన్నో కేసులు పెట్టిందని అయిన అదర లేదు బెదరా లేదని. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమములో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమములో పాల్గొని వేల సభ్యత్వాలు నమోదు చేయించాను, అనేక బందులు, రాస్తా రోకోలో పాల్గొన్నానని. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం ఇష్టం నేను పడ్డ కష్టానికి నా మీద నమ్మకంతో ఎస్సీ సెల్ మండల అధ్యక్ష పదవి నాకు ఇచ్చినందుకు ఈ బాధ్యతను సక్రమముగా నిర్వర్తించి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నామీద నమ్మకంతో ఈ బాధ్యతను ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >