| Daily భారత్
Logo




సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

News

Posted on 2026-07-31 05:03:03

Share: Share


సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి  న్యాయవ్యవస్థకు, బాధితులకు న్యాయం అందించే ప్రక్రియలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎండి రజాక్ చేసిన సేవలు అజరామరమని, ఆయన మృతి న్యాయరంగానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎండి రజాక్ (65) అనారోగ్యంతో మృతి చెందగా, గురువారం చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఈ సందర్భంగా రజాక్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి అశ్రునయనాల మధ్య నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వృత్తిధర్మానికి కట్టుబడి సమాజంలో పేదలకు, బాధితులకు న్యాయపరమైన సేవలు అందించడంలో రజాక్ ఎల్లప్పుడూ ముందుండేవారని ఆయన గుర్తుచేశారు. నివాళులర్పించినవారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు నయీమ్ ఖురేషి, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి తదితరులు వున్నారు.

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >