| Daily భారత్
Logo




పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

News

Posted on 2026-08-05 17:07:25

Share: Share


పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

డైలీ భారత్, కామారెడ్డి : పెద్ద కొడాపుగల్ గ్రామానికి చెందిన పండరి – స్వరూప దంపతులు వరుస విషాదాలతో తీవ్ర కష్టాల్లో జీవనం సాగిస్తున్నారు. కుమారుడిని కోల్పోయిన ఈ కుటుంబానికి మరో దెబ్బగా స్వరూప గారు గత 10 సంవత్సరాలుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

వైద్య ఖర్చుల కోసం కుటుంబం తమ 25 గుంటల భూమిని విక్రయించుకున్నట్లు తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ దత్త ఆధ్వర్యంలో ట్రస్ట్ తరఫున “నెలకొక మంచి పని – నెలకొక సేవ” కార్యక్రమంలో భాగంగా 11వ నారాయణ సేవ నిర్వహించారు.

కామారెడ్డి బృందావన కాలనీలో నివసిస్తున్న ఈ నిరుపేద కుటుంబానికి శ్రీ మాత  కుటుంబ సభ్యుడు మచ్చ నాగరాజు గుప్తా ద్వారా 25 కిలోల బియ్యం, కిరాణా సామానులు, కూరగాయలు అందజేశారు.

ట్రస్ట్ సభ్యులు భవిష్యత్తులో కూడా కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

పట్నం శెట్టి శ్రీనివాస్, మచ్చ నాగరాజు గుప్తా, సాయిరాం, సంఘ రాజు, భాస్కర్, శ్రీకాంత్

మానవ సేవే మాధవ సేవ — శ్రీమాతా సేవ కుటుంబం

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >