| Daily భారత్
Logo




ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

News

Posted on 2026-08-14 18:03:54

Share: Share


ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

డైలీ భారత్ డెస్క్:ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో చికెన్‌ షాపు నడుపుతున్న ఐతనబోయిన ప్రశాంత్‌ (26) ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, మద్యపాన వ్యసనాలకు బానిసై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. తన షాపు సమీపంలోనే నివసిస్తున్న వృద్ధురాలు సుగుణపై కన్నేశాడు. ఆమె ధరించే బంగారు ఆభరణాల కోసం జూలై 17 రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు.

సుగుణ అరుస్తూ ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె నల్లపూసల హారం నుంచి బంగారు చైన్‌, బంగారు పూసలు తీసుకుని పారిపోయాడు. దోచుకున్న బంగారు చైన్‌ను తన బావ మరదలి సరగండ మహేష్‌ (20, మహబూబాబాద్‌ జిల్లా బాలినిధర్మారం గ్రామం)కు అప్పగించాడు. మహేష్‌ ఆ చైన్‌ను ఖమ్మంలోని ఓ బ్యాంకులో తన పేరుతో తాకట్టు పెట్టి సుమారు రూ.1.50 లక్షలు రుణం తీసుకున్నాడు.

బంగారం గుర్తింపు, తాకట్టు వివరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆగస్టు 9 ఉదయం తిరుమలాయపాలెం రోడ్డు వెంబడి విచారణ సాగిస్తుండగా ప్రశాంత్‌, మహేష్‌లను అరెస్ట్‌ చేశారు. ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా, మహేష్‌ను దొంగిలించిన బంగారం పారవేయడంలో సహకరించిన నిందితుడిగా పోలీసులు పరిగణిస్తున్నారు.

నిందితుల ఆర్థిక పరిస్థితులు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలు, హత్య సంబంధిత వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >