Posted on 2026-08-14 18:10:20
ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారి పరిస్థితి మరియు కళాశాలల పరిస్థితి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ పేద విద్యార్థుల పైన లేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు ఆరోపించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కోర్సులను పూర్తి చేసుకున్న వారి యొక్క సర్టిఫికెట్లను కళాశాలలో నుండి తీసుకువెళ్లే పరిస్థితి లేదని అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా చెల్లించడంలో విఫలం కావడం జరిగిందని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారని అన్నారు. గతంలో అధికారంలోకి వస్తే పూర్తి బకాయిలను చెల్లిస్తామని ఎన్నో సందర్భాల్లో చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఫీజుబకాయలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఫీజు బకాయిల గురించి అడిగితే గత ప్రభుత్వానికి సంబంధించిన ఫీజుబకాయలను నేనెందుకు చెల్లిస్తానని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఎంతమంది కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడం జరిగిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఫీజుబకాయల విడుదల కోసం విద్యార్థులతో కలిసి ఉద్యమ బాట పడతామని అన్నారు.
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >