Posted on 2026-08-14 18:18:19
డైలీ భారత్, సిరిసిల్ల హైదరాబాద్: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె. పున్నంచందర్‌కు “బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్” అవార్డు లభించింది.
మానసిక ఆరోగ్య రంగంలో అందిస్తున్న సేవలు, కౌన్సెలింగ్ ద్వారా చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఆత్మహత్యల నివారణ కోసం గత 16 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రజలకు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సెల్ సంస్థ జాతీయ అధ్యక్షుడు కొప్పుల విజయకుమార్, జాతీయ ఎస్.సి. కమిషన్ మాజీ సభ్యులు కె. రాములు, విమెన్ సేఫ్టీ తెలంగాణ వింగ్ సురేఖ చేతుల మీదుగా పున్నంచందర్ అవార్డును అందుకున్నారు.
అదేవిధంగా హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విశేషమైన సామాజిక సేవలు అందిస్తున్న అలువాల ఈశ్వర్‌కు బెస్ట్ నేషనల్ సోషల్ సర్వీస్ అవార్డును అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న గడ్డం దినకర్‌కు మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్‌తో పాటు పలు సంఘాల ప్రతినిధులు, సభ్యులు పున్నంచందర్, అలువాల ఈశ్వర్, గడ్డం దినకర్‌లను అభినందించారు.
మానసిక ఆరోగ్యం, సామాజిక సేవ, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ముగ్గురికి ఒకే వేదికపై అవార్డులు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >