Posted on 2026-08-15 03:41:51
హత్యాయత్నం కేసులో నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు.
డైలీ భారత్, కోనరావుపేట : భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిపై పారతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రవీందర్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిమల్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన సామల శ్రీనివాస్ (47), అతని వదిన సామల లచ్చవ్వ (50)కు అదే గ్రామానికి చెందిన పెద్దగొల్ల సత్తయ్యతో బీరప్ప గుడి సమీపంలోని 8 గుంటల వ్యవసాయ భూమి, ఆ భూమికి వెళ్లే దారి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై ఆగస్టు 12న గ్రామంలో కుల సంఘం ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం శ్రీనివాస్, లచ్చవ్వ వివాదాస్పద భూమి వద్దకు వెళ్లి సత్తయ్య భూమిలో రాళ్లను హద్దులుగా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన సత్తయ్య రాళ్లు పెట్టడంపై ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో శ్రీనివాస్ తన వెంట తెచ్చుకున్న పారతో సత్తయ్య తలపై దాడి చేయడంతో తీవ్ర గాయమైందని పోలీసులు తెలిపారు. ఘటనపై అదే రోజు కోనరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో కృషి చేసిన కోనరావుపేట ఎస్ఐ కె. ప్రశాంత్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందిని చందుర్తి సీఐ కె. రవీందర్ అభినందించారు.
#Konaraopet #KonaraopetPolice #Chandurthi #RajannaSircilla #SircillaPolice #CrimeNews #AttemptToMurder #MurderAttempt #LandDispute #PoliceArrest #CrimeNewsTelangana #TelanganaPolice #PoliceNews #SircillaNews #RajannaSircillaNews #TelanganaNews #BreakingNews #LatestNews
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >