Posted on 2024-02-25 17:41:58
కుటుంబాలనే చిన్నా భిన్నం చేశారు
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
317 జీఓతో ఉద్యోగస్తులు ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్ని కావు
దామోదర రాజనర్సింహ కమిటీ ఉద్యోగస్తులకు స్వాంతన చేకూరుస్తుంది
ఆశాస్త్రీయంగా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు
షాద్ నగర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : గత పది ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతల్లో తెలంగాణ ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసారని ఉద్యోగస్తులను అయితే రాచి రంపాన పెట్టాడని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" ధ్వజమెత్తారు. పరిపాలన సౌలభ్యం పేరిట గ్రామాల నుండి మొదలుపెట్టి మండలాలు, జిల్లాలు అన్ని విభజించి ప్రజలను నరకయాతనకు గురి చేశాడని, కెసిఆర్ పాలన అదో పీడకల అంటూ వీర్లపల్లి శంకర్ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న జీవో 317 సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేలా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటయ్యిందని అన్నారు. వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండనున్నారనీ తెలిపారు. వీరు జీవో 317తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగులు - ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు.. ఇలాంటి అనేక అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫారసులతో పాటు నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన జీవో (నెం. 292)లో పేర్కొన్నారనీ తెలిపారు. ఈ కమిటీకి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారనీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో 317 ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితోనూ, వారు పనిచేస్తున్న హెచ్ఓడీలతోనూ, సంబంధిత డిపార్టుమెంట్ల సెక్రటరీలతోనూ చర్చించనున్నదనీ, కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించే సమావేశాలకు ఆయా డిపార్టుమెంట్ల సెక్రటరీలు, హెచ్ఓడీలు హాజరై సహకారం అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ తాజా జీవోలో స్పష్టం చేశారనీ పేర్కోన్నారు. దాదాపు రెండున్నరేండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకుని వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పనిచేయనున్నదని, ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనున్నదనీ వివారించారు.
గత ప్రభుత్వం పది జిల్లాలను 31 జిల్లాలుగా మార్చినప్పుడు అప్పటికి 33 జిల్లాలు లేవనీ అయితే 2021 డిసెంబరు 6న జీవో నెం. 317ను జారీచేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలవారీగా శాశ్వత ప్రాతిపదికన పోస్టింగులు ఇచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల (2018 నాటి) స్ఫూర్తికి అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. ఉమ్మడి జిల్లాల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాల్లోకి పంపేలా ఈ జీవోను జారీచేసిందనీ కానీ మార్గదర్శకాల్లోని లోపాలతో పాటు అప్పటి అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉన్న ఉద్యోగులు వారికి అనువైన స్థానాల్లో పోస్టింగులు ఇప్పించుకున్నారని, అర్హతలు కలిగిన ఉద్యోగుల్లో చాలా మందికి న్యాయం జరగలేదని అప్పటి సచివాలయాన్ని ముట్టడించారనీ గుర్తు చేశారు. అప్పటి నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయిందనీ, జీవో 317లో ప్రభుత్వం ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించేటప్పుడు (కేడర్ అలాట్‌మెంట్) స్థానికతను, కుటుంబ నేపథ్యాన్ని, భార్యాభర్తల ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచే వినిపించాయనీ ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో నాన్-ట్రైబల్ ఉద్యోగులను పర్మినెంట్‌గా పోస్టింగ్ చేయడం ద్వారా మొత్తం మంజూరు పోస్టుల సంఖ్యలో తేడాలు వచ్చి భవిష్యత్తులో ఖాళీ పోస్టుల భర్తీ సమయంలో స్థానికంగా ఉన్న గిరిజనులు, ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని తుడుందెబ్బ ఆందోలన వ్యక్తం చేసి అప్పట్లో ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యులంతా ఒక జిల్లాలో ఉంటే ఈ జీవో కారణంగా దూరంగా ఉన్న మరో జిల్లాకు బదిలీ అవ్వాల్సి వస్తున్నదని, ఇది పర్మినెంట్ పోస్టింగ్ కావడంతో భవిష్యత్తు మొత్తం సొంత ఊరికి (జిల్లాకు), బంధువులకు సంబంధం లేని కొత్త జిల్లాల్లో గడపాల్సి ఉంటుందన్న ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేసిందనీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్ఎస్‌కు దూరం కావడానికి ఈ జీవో కారణమైందని, ఓటమికి ఇదీ ఒక ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే వాపోయారన్నారు. ఈ కారణంగానే వారంతా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారనీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కాంగ్రెస్ పార్టీ “జీవో 317ను సమీక్షించి బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీలను ఏటా వేసవి కాలంలో చేపడతాం..” అని హామీ ఇచ్చిందనీ దానికి అనుగుణంగానే ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించడంతో పాటు భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నవారిని, పదోన్నతులు లేకుండా పోస్టింగ్‌పై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నష్టపోయిన ఉద్యోగుల అభిప్రాయాలను కూడా తెలుసుకోనున్నదనీ వివరించారు.
అశాస్త్రీయంగానే చేశారు..
తెలంగాణలో పరిపాలన సౌలభ్యం పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పనులు అశాస్త్రీయంగానే చేశారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. గ్రామాలను పంచాయతీలు చేసే విషయం మొదలుపెట్టి మండలాలు, జిల్లాలు అన్ని అశాస్త్రీయంగానే చేపట్టారని దుమ్మెత్తి పోశారు. మేధావులను నిపుణులను సంప్రదించకుండా ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా స్ధానిక విభజనలు జరిగాయని అన్నారు. అందుకే ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు అవసరమైన గ్రామాలను మాత్రమే స్వార్ధపూరితంగా గ్రామపంచాయతీలు చేశారని మండలాలు కూడా చేశారని విరుచుకుపడ్డారు. నియోజక వర్గంలో మొగిలిగిద్ద చలివేంద్రం పల్లి, అంతిరెడ్డి గూడా, సంఘీకూడా తదితర గ్రామాలను గుర్తించాల్సి ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోలేదని, మాజీ ప్రజాపతినిధి ఓ పెద్ద మూర్ఖుడు అంటూ శంకర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. భౌగోళిక స్వరూపానికి భిన్నంగా పరిపాలన సౌలభ్యం పేరిట విధ్వంసం సృష్టించారని శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొంగరకలాన్ కూడా ప్రజలకు ఉపయోగం లేనివిధంగా కలెక్టరేట్ భవనం నిర్మించారని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా కొత్తూరు, నందిగామ రెండు మండలాలను శంషాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధికి తరలించడం లాంటి అనేక తప్పిదాలను చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటిపై కులంకుశంగా పరిశీలన చేస్తుందని, భవిష్యత్తులో ప్రజలకు అనువైన విధంగా పాలిస్తుందని శంకర్ స్పష్ట చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, అందే మోహన్, ముబారక్ ఖాన్, రాయికల్ శ్రీనివాస్, మహెబుబ్, గంగమొని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >