Posted on 2024-02-25 17:52:33
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబిలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి..
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. కాగా ఫ్యాక్టరీలో 15 నుంచి 20 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అగ్నిప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున స్పాట్ కు చేరుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఈ బాణాసంచా ఫ్యాక్టరీ చాలా కాలం నుంచి టపాసులను తయారు చేస్తోంది. అయితే.. ఫ్యాక్టరీ యాజమాన్యం లైసెన్స్ తీసుకున్నారా లేదా అనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >