Posted on 2024-02-26 12:44:13
రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా, గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టార్ హోటల్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది.
పార్టీలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు... డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నాయకుడి కుమారుడు ఉండటం గమనార్హం.
కాగా, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి సదరు నేత బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ హోటల్ కూడా ఆయనదేనని సమాచారం. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం.ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఈ పార్టీలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారని ఆరా తీస్తున్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >