| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉంది: సిఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2024-02-27 21:07:57

Share: Share


కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉంది: సిఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచాము

నిరుద్యోగుల గురించి  కేసీఆర్ ఏనాడు ఆలోచించలేడు

చేవెళ్ల జన జాతర బహిరంగ సభలొ పాల్గోన్న సిఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి బ్యూరో :కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గత అసెంబ్లీ ఎన్నికల నాటి ఊపు ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ నేతలను పిలుపునిచ్చారు. గత ప్రభుత్వలో అణిచివేతకు గురైన అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని తెలిపారు. కార్యకర్తల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోనని.. వాళ్ల రుణం తీర్చుకొని తీరుతానని మాటిచ్చారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లో రెండు కీలక హామీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు.

ఇచ్చిన మాటను అటు సోనియా గాంధీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తప్పలేదని గుర్తుచేశారు. మన చిరకాల కోరిక అయిన తెలంగాణ ఇచ్చి కోట్లాది ప్రజల ముఖాల్లో చిరున్వవ్వు నింపారని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఇవాళ పేద ప్రజలు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారని అన్నారు. పేదల గురించే కాదు.. నిరుద్యోగుల గురించి కూడా కేసీఆర్ ఏనాడు ఆలోచించలేదని మండిపడ్డారు. కేవలం తన కుటుంబసభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

తాను తాత, తండ్రి పేరు చెప్పుకొని పైకి రాలేదని.. అవినీతి పరులను, దుర్మార్గులను తొక్కుకుంటూ పైకొచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను దోచుకున్న ఎవరినీ వదిలిపెట్టబోను అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రాన్ని దోచుకున్న వారికి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు.. ఇక మా వాటా ఇవ్వాల్సి ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరైనా అంటే తన్నండి అని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలిపించి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ వస్తారో.. కేటీఆర్ వస్తారో తాము చూస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర మహిళల కళ్లల్లో నీళ్లు రావొద్దని రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కలిగించాలనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం భావించిందని గుర్తుచేశారు. కేవలం రూ.1500 లకే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పథకానికి ఇప్పటికే 40 లక్షల మందిని గుర్తించామని అన్నారు. ఎవరికైనా పథకం అందకపోతే మండల కార్యాలయానికి వెళ్లి పేర్లు రాయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పట్నం మహేందర్ రెడ్డి,చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భరత్,వికారాబాద్ జెడ్ పి ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, టీ పి సి సి ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూధన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు ,మహిళలు తదితరులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >