| Daily భారత్
Logo




ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

News

Posted on 2024-03-19 18:17:52

Share: Share


ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మెదక్ మండలం అవుసుల పల్లికి చెందిన కందుల రాములు ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో రైటర్ సురేందర్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో రూ. 15 వేలు రైటర్ సురేందర్‌తో ఒప్పందం కుదుర్చుకొని మొదటగా నాలుగు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడితో మాట్లాడిన అధికారులు మంగళవారం పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు నాలుగు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.. వారం రోజుల క్రితం పది వేలు ఇచ్చిన బాధితుడు మరోసారి డిమాండ్ చేయడం వల్లనే ఏసీబీనీ ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >