| Daily భారత్
Logo




జగన్నాథ్ రథయాత్ర వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

News

Posted on 2024-07-15 19:17:22

Share: Share


జగన్నాథ్ రథయాత్ర వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

భక్తిశ్రద్ధలతో  పూజలు.....

కదిలాయి జగన్నాథ రథచక్రాలు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: సాంస్కృతిక సమగ్రతకు మారుపేరు పూరి జగన్నాథ వేడుకలని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కాలనీలో కొలువైన శ్రీ పూరి జగన్నాథ స్వామి వేడుకలలో భాగంగా సోమవారం పట్టణంలో భారీ రథయాత్రను నిర్వాహకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ కే నరేందర్ స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు స్వామి కనువిందు చేస్తారన్నారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారని అన్నారు. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మధ్వజం’ అని భక్తులు పిలుస్తారన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను  ఆభరణాలతో అలంకరిస్తారని, ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుందని పేర్కొన్నారు. పూరి జగన్నాథుడి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో విశేషాత్మకంగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో పూరి జగన్నాథుడి వేడుకలు రథయాత్ర జరపడం ఎంతో ఆనందంగా ఉందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు..

Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >