Posted on 2023-10-31 17:58:54
డైలీ భారత్, సిరిసిల్ల : ఈరోజు రాజన్న సిరిసిల్ల తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంను నిర్వహించారు....
సందర్భంగా వారు మాట్లాడుతూ పరాయి పాలకుల చెంత నుండి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసి స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదర్శవంతమైన పాలన దక్షత ను గురించి అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతంను గతంలో ఎన్నడు కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందేలా చూస్తూ పారదర్శకంగా ప్రభుత్వ సేవలను గడప గడపకు అందిస్తున్న మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఈ శాసనసభ ఎన్నికల్లో మరోసారి బారి మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేసేలా రేపు ఉదయం 9 గంటలకు స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడపకు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలోని అన్ని వార్డులలో సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని అన్నారు..
అదేవిధంగా అన్ని వార్డులలో ప్రతిరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే పార్టీ ముఖ్య నాయకులు కౌన్సిలర్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిరోజు 4 వార్డులలో విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం కూడ నిర్వహిస్తామని అన్నారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ , జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అగ్గి రాములు, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, వార్డు శాఖల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >