Posted on 2023-10-31 13:12:17
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) సందర్భంగా 17వ బెటాలియన్ సర్థాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.
అనంతరం బెటాలియన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరి చేత కమాండెంట్ ప్రతిజ్ఞ చేయించారు.
"సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్యలు మరియు సూచనల ద్వారా భారతదేశం యొక్క ఏకీకరణకు పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క అంతర్గత ,శాంతి భద్రతలకు నాయొక్క సహాయ సహకారాలు అందిస్తానని , నా దేశం యొక్క ఐక్యతకు పాటుపడుతూ దేశ భద్రతకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని నా ప్రతిజ్ఞ"
అని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడుగా, భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మినిస్టర్ గా భారతదేశానికి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు రాచరిక సంస్థానాల విలీనంలో వల్లభాయ్ పటేల్ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్, జూనాగడ్ వంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు అని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడిన మహనీయుడు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ. జయప్రకాష్ నారాయణ ,యమ్.పార్థసారథి రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శ్రీమతి శైలజ ,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >