Posted on 2024-07-22 12:08:42
డైలీ భారత్, అత్తాపూర్: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది కబ్జారాయళ్ల వశమైనట్టే. ఇందుకోసం ప్రత్యేకంగా గ్యాంగ్‌లు తిరుగుతున్నాయి. తాజాగా అత్తాపూర్‌లో ల్యాండ్ కబ్జాకి వచ్చిన 9మంది సభ్యుల గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
జంట నగరాల్లో ఖాళీ స్థలాలు కనిపిస్తేచాలు కబ్జా అయిపోయినట్టే. ఖాళీ స్థలాలను సొంతం చేసుకునేందు కు రౌడీషీటర్లు భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఆ తరహా వ్యవహారం ఒకటి అత్తాపూర్‌లో బయటపడింది. ఉప్పర్‌పల్లి అక్బర్ హిల్స్ ప్రాంతంలో ఐదు వందల గజాల భూమిలో కొందరు రాత్రివేళ నిర్మాణాలు చేపట్టారు. ఫక్రుద్దీన్ గ్యాంగ్ దీన్ని కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళ ఈ గ్యాంగ్ మూమెంట్స్ అధికంగా ఉంది.
వాళ్లను గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగి రైడ్స్ చేశారు. దాదాపు 9మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పదునైన కత్తులు, గన్స్, హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ప్రాంతంలో ఆ గ్యాంగ్ డాగ్స్‌ను తీసుకురావడం, మరణాయుధాలు ఉంచడం, ఆ స్థలం చుట్టూ సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం స్పష్టంగా కనిపించింది.
బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తోంది ఫక్రుద్దీన్ గ్యాంగ్. గతంలో ఈ గ్యాంగ్ నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. కొద్దిరోజుల కిందట శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్యాంగే ఇక్కడ కూడా కార్యకలాపాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు రియల్టర్లు ఉన్నారు.
ఫక్రుద్దీన్ గ్యాంగ్‌కు సంబంధించి ఇది మూడో వ్యవహారం. వీరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి విచారణలో ఈ గ్యాంగ్‌కు సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >