| Daily భారత్
Logo




రండి బాబు రండి ఒకటి కొంటే మరొకటి ఉచితం

News

Posted on 2024-07-22 21:18:36

Share: Share


రండి బాబు రండి ఒకటి కొంటే మరొకటి ఉచితం

అదిరిపోయే ప్యాకింగ్ లతో పాడైపోయిన వస్తువులను అంటగడుతున్న సూపర్ మార్కెట్లు

షాద్ నగర్ నేషనల్ మార్ట్ లో కల్తీ వస్తువులతో నయా దందా

తినబోతూ ప్యాకింగ్ తెరిస్తే పురుగులు పట్టిన ఖర్జూర పండ్లు

నాసిరకమైన వస్తువులతో మోసపోతున్న కొనుగోలుదారులు

సరైన నిఘా లేకపోవడంతో ప్రజారోగ్యానికి కల్తీల ముప్పు

జిల్లా ఆహార తనిఖీ అధికారులు కొంచెం ఇటు ఓ కన్నేయండి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు.  ఖర్జూర పండ్లు,సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, డాల్డా, పోపు గింజలు, మసాల దినుసులు, పొడులు, పసుపు, కారం, తదితర వస్తువులతోపాటు పచ్చళ్లను పాలిథిన్‌ ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి హోల్‌సెల్‌, రిటైల్‌ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆయా షాపుల నుంచి దుకాణాల ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి.ఇలా కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్‌, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని వినియోగదారుల నుంచి తరచూ వింటున్న మాటలు


కనీస నాణ్యత ప్రమాణాలు కరువు

ఆహార పదార్థాల తయారీలో ఉత్పత్తిదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. అదిరిపోయే ప్యాకింగ్ లతో వినియోగదారులను ఆకర్షించడానికి ఒకటి కొంటె  మరోటి ఉచితం అనే ఆఫర్లతో నాసిరకమైన ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు మారుమూల గ్రామాలలో  జరుగుతుందంటే ఎవరూ పట్టించుకోరు అనుకోవచ్చు కానీ షాద్ నగర్ లాంటి నగరాల్లో అది కూడా ఆకర్షణీయమైన ప్రకటనలతో ఈ మధ్య నూతనంగా ప్రారంభించిన నేషనల్ మార్ట్ సూపర్ మార్కెట్లో 176 రూపాయలకు ఒకటి కొంటే మరోటి ఉచితం అంటూ ఖర్జూర పండ్లను ఎలిఫెంట్ డేట్స్ పేరుతో విక్రయిస్తున్నారు.  ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్లతో సాధారణ జనాలను ఆకర్షిస్తున్నారు.  శనివారం ఓ వినియోగదారుడు  ఎలిఫెంట్ డేట్స్ పేరుతో ఉన్న ఖర్జూర పండ్లను కొని ఇంటికి తెచ్చుకున్నాడు.తీరా తిందామని ప్యాకింగ్ ఓపెన్ చేస్తే పురుగులు పట్టిన నాసిరకమైన ఖర్జూర పండ్లు దర్శనమిచ్చాయి ఒక్కసారిగా షాక్ కు గురైన వినియోగదారుడు. వాటిని అలాగే ఉంచి మరుసటి రోజున నేషనల్ మార్ట్ యాజమాన్యానికి తెలియజేస్తే వారి స్పందన మరోలా ఉంది దానికి బదులు మరోటి తీసుకెళ్లండి లేదంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్తున్నారని వినియోగదారుడు వాపోతున్నాడు ఇలా నాసిరకమైన వస్తువులను అంటగడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని సదరు వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ ఖర్జూర పండ్లను తింటే వచ్చే లాభాలేంటో తెలియవు గాని  వర్షాకాలంలో రోగాలు మాత్రం తప్పకుండా వస్తాయి ఈ నాసిరకమైన వస్తువులను ప్రజలు కొనుగోలు చేసి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న ఆహార తనికి అధికారులు మాత్రం ఈ కల్తీ వస్తువులను తయారు చేస్తున్న ముఠాలపై ఉక్కు పాదం మోపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అంటున్నారు

ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం 2006ను అనుసరించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నియంత్రణ సంస్థను భారత ప్రభత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్యాకేజీ ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్‌ చేయాలన్నా సంస్థ నుంచి లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >