Posted on 2023-11-01 12:18:46
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నేతలు, ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది.
తాజాగా..మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రగతి భవన్ వేదికగా.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ కంప్లైంట్స్ అందాయి.
దీంతో రిటర్నింగ్ అధికారిని, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పంపించి విచారణ జరిపినట్లు రొనాల్డ్ రాస్ వెల్లడించారు. కోడ్ ఉల్లంఘనలపై మంత్రి కేటీఆర్ వివరణ కోరుతూ మంగళవారం నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
పూర్తి విచారణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం చెప్పిందని ఎన్నికల అధికారి గుర్తుచేశారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >