| Daily భారత్
Logo




సిరిసిల్ల బిజెపి పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన లగిశెట్టి శ్రీనివాస్

News

Posted on 2023-11-03 13:26:42

Share: Share


సిరిసిల్ల బిజెపి పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన లగిశెట్టి శ్రీనివాస్

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల బిజెపికి భారీ షాక్ ఎదురైంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిషెట్టి శ్రీనివాస్, మరికొందరి నేతలతో కలిసి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడుకి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుదినై, బండి సంజయ్ తనకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించడంతో పాటు సిరిసిల్ల టికెట్టు ఇస్తానని హామీ ఇవ్వడం వల్ల బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరినట్లు తెలిపారు. బిజెపి బిసిలకు పెద్దపీట వేస్తుందని నమ్మి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తీరా ఎన్నికల సమయంలో స్థానికులకు టికెట్టు ఇవ్వకుండా ప్యారశుట్ లీడర్ రాణి రుద్రమకు సిరిసిల్ల టికెట్టు అధిష్టానం ప్రకటించారని మండిపడ్డారు. 90 శాతం ఉన్న పద్మశాలి వర్గాన్ని విస్మరించి, స్థానికేతరులకు టికెట్టు కేటాయించడాన్ని విమర్శించారు. అందువల్లే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా సిరిసిల్ల బరిలో ఉంటున్నట్లు తెలిపారు. ఒక బిసి బిడ్డగా తనను  ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మద్దతు తనకు ఉందని,  సమస్యలపై అవగాహన ఉన్న స్తానికుడైన తనను గెలిపించాలని కోరారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఆమోదించాలని కోరారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >