Posted on 2023-11-04 17:29:27
సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ లో విలీనమైన గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఒకటో వార్డు రగుడు లో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆవిడ ప్రారంభించారు. ఈ సందర్భంగా రగుడు, చెంద్రంపెట, శ్రీనగర్ కాలనీ, శాంతినగర్, అంబేద్కర్ నగర్, రెడ్డివాడ, రాళ్ళబావి, పెద్దబజార్, లాల మల్లేశం బజార్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా, 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి, సిరిసిల్ల ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయకుండా నిర్బంధాలకు, అక్రమాలకు, అరెస్టులకు తెరలేపిన కేటీఆర్ ను గద్దె దింపడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో బిజెపి అభ్యర్థిగా తాను సిరిసిల్లకు రావడం జరిగిందన్నారు. విలీన గ్రామాలకు న్యాయంగా దక్కవలసిన హక్కులను కేటీఆర్ కాలరాసాడని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనను అసెంబ్లీకి పంపిస్తే కొట్లాడి విలీన గ్రామాలను మళ్ళీ గ్రామపంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతుందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సిరిసిల్లాను దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. విద్యా, వైద్యం ,ఉపాధికి బిజెపి పెద్దపీట వేస్తుందని, కమిషన్ల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ నాయకులను ఓడించి, సబండ వర్గాల కోసం పనిచేస్తున్న బిజెపిని ఆదరించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు అవకాశాలు ఇచ్చారని ఇప్పుడు బిజెపి పార్టీ అభ్యర్థిగా ఒక ఆడబిడ్డగా వచ్చిన తనను సిరిసిల్ల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో బిజెపి జిల్లా, మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >