| Daily భారత్
Logo




మరో ఐదేళ్లు రేషన్ ఉచితమే.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

News

Posted on 2023-11-04 17:47:37

Share: Share


మరో ఐదేళ్లు రేషన్ ఉచితమే.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

డైలీ భారత్: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పేదలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దీని ద్వారా 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని, అన్ని వర్గాలకు ఉచిత బియ్యం అందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఆర్థిక లాభాలకు ప్రాధాన్యత ఇస్తోందని.. తరచూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

“కాంగ్రెస్ ఆత్మగౌరవం – ఆత్మవిశ్వాసం గల పేదలను ద్వేషిస్తుంది. పేదలు ఎల్లప్పుడూ తన ముందు నిలబడి వేడుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి అది పేదలను, పేదల్లానే ఉంచాలని కోరుకుంటుంది. కాబట్టి, ఇక్కడ అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేసే ప్రతి పనిని ఆపడానికి తన శక్తిని ఉపయోగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.. గత ఐదేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం.. అవినీతిని మీరు సహించారు. నన్ను నమ్మండి, కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత మీరు ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు” అంటూ ప్రధానమంత్రి మోదీ హామీనిచ్చారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి మొత్తం సమాజాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తాను దుర్వినియోగాలకు భయపడనని.. అందరి అభ్యున్నతే లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.

కాగా.. ప్రధాని మోదీ ప్రకటనలు రాజకీయ వేడిపుట్టించాయి. ఎన్నికలకు ముందు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదిలాఉంటే.. ఛత్తీస్‌గఢ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న, రెండో విడతలో మిగతా 70 స్థానాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >