| Daily భారత్
Logo




బిఆర్ఎస్ పార్టీని అంతం చేసేది కాంగ్రెస్ పార్టీయే : కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి

News

Posted on 2023-11-07 16:10:03

Share: Share


బిఆర్ఎస్ పార్టీని అంతం చేసేది కాంగ్రెస్ పార్టీయే : కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి

డైలీ భారత్, సిరిసిల్ల: బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ఆరు నెలల వ్యవధిలోనే తెలిసిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చక్రధర్ రెడ్డి అన్నారు. సోమవారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు తాను సుపరిచితున్ని అని, బిఆర్ఎస్ అరాచక పాలనను అంతం చేయాలని బిజెపిలో చేరినట్లు తెలిపారు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని తెలిసిందన్నారు. బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీలో చేరిన తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పదవి ఇచ్చినా, పార్టీలో మాత్రం సమషిత న్యాయం జరగలేదని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ వారికి శిక్ష ఎందుకు పడలేదని బిజెపి పేద నేతలను నిలదీశామన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, బిఆర్ఎస్ అంతం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. రాహుల్ గాందీ న్యాయకత్వంలో తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్నారు. కేకే మహేందర్ రెడ్డి నిస్వార్థ నాయకుడని, ఎంతో మంది టికెట్టు అడిగిన కేకే మాత్రమే కేటీఆర్ కు గట్టి పోటీ అని నమ్మి అధిష్టానం కెకెకు టికెట్టు ఇచ్చిందన్నారు. పార్టీలో చేరి సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >