Posted on 2024-09-04 18:59:58
సెర్ప్ సీఈవో దివ్య దేవ రాజన్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సెర్ప్ అండగా ఉంటుందని సేర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అన్నారు. బుదవారం కొత్తూరు మండలంలోని ఇన్ముల్ నర్వ గ్రామాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా గ్రామంలో గల మట్టి పాత్రల తయారీ యూనిట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మట్టి పాత్రల తయారు చేసే సభ్యులతో కలిసి మట్టి పాత్రల తయారు చేసే విధానం, మార్కెటింగ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి దగ్గరగా జెపి దర్గా సందర్శక స్థలం ఉందని, అక్కడికి రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు వస్తారన్నారు. మహిళా సంఘం సభ్యులు తయారుచేసిన మట్టి పాత్రలను అమ్మడం జరుగుతుందని ఆమెకు తెలిపారు. హైద్రాబాద్ మరియు ఇతర ప్రదేశాలలో మట్టి పాత్రల వ్యాపారం చేసుకొనే వ్యాపారస్తులకు అడర్స్ పైన ఎగుమతి చేస్తామన్నారు. ఈ సంధర్బంగా సిఈఓ మాట్లడుతూ ఈ మట్టి పాత్రలు తయారు చేసే విధానములో కొత్త టెక్నాలజీని వాడే క్రమంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్న సభ్యుల కుల వృత్తులకు బిఎల్, ఎస్ఎన్, సీఐఎఫ్, విఓ సంస్థల నుండి ఋణాల రూపంలో ఆర్థిక సహాయానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, రాష్ట్రస్థాయి సర్ప్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కొత్తగా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా సభ్యులకు కొత్త వ్యాపారాలు, పాడి పశువులు, నాటుకోళ్లు పెంపకం, మిల్క్ ప్రోడక్ట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఇతర వ్యాపారాలకు కావలసిన నైపుణ్య శిక్షణతో పాటు రుణ రూపంలో ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూర్ మండల సమాఖ్య ఎపిఎం కొండయ్య, సిసిలు రాజప్ప, ఖలీల్, లక్ష్మమ్మ, అలివేలు, వీఓఎ లు, గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు..
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >