| Daily భారత్
Logo




రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

News

Posted on 2026-04-18 17:07:03

Share: Share


రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

 దళిత యువ నాయకుడు దేవోల్లారాములు

డైలీ భారత్ కామారెడ్డి/ పాల్వంచ: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామంలో ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పడిన వివాదంపై దళిత యువ నాయకుడు దేవోల్లా రాములు స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ గ్రామంలో అన్ని వర్గాలతో సమానంగా మెలుగుతూ, దళితులను ప్రోత్సహిస్తూ సేవ చేస్తున్న వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. హనుమాన్ టెంపుల్ చైర్మన్‌గా ఉన్న రమేష్ గౌడ్ కులవివక్ష లేకుండా అందరినీ సమానంగా భాగస్వామ్యం చేయిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు.

అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో రమేష్ గౌడ్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు చేయడం రాజకీయ కక్షతో చేసిన చర్య అని రాములు ఖండించారు. "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ నినాదాన్ని ప్రస్తావిస్తూ, బహుజన వర్గాల అభ్యున్నతికి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారని స్పష్టం చేశారు.

రాజకీయ విభేదాలను కుల సంఘాలకు ముడిపెట్టి గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని, ఇలాంటి చర్యలు తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రమేష్ గౌడ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడం అనుచితమని, అలా జరిగితే గ్రామస్తులంతా కలిసి చర్చ ద్వారా సమస్యను పరిష్కరిస్తామని హెచ్చరించారు.

తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదులు చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఆపాలని ఆయన కోరారు.

అలాగే గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ మరియు కొంతమంది వార్డు సభ్యులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకుండా, తమకే కీర్తి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

గ్రామంలో గత పాలనలో జరిగిన అవినీతి అంశాలను బయటపెడితే కొందరు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. దళితులను రాజకీయంగా ఉపయోగించుకోవడం మానుకోవాలని, సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఆపాలని గట్టిగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ దళిత నాయకులు యువ విష్ణు, బైండ్ల రామస్వామి, బట్ట లక్ష్మీ నర్సు( లడ్డు), బట్టింకి భూమయ్య, బట్ట బాల నర్సు, బట్టింకి రాజారాం, బట్ట నరేష్, అంబల్ల నాగరాజు, ఎర్రోళ్ల నరసింహులు, కొనోళ్ల గోపాల్, బట్ట ప్రశాంత్, డి. లక్ష్మణ్, మేకల భూమవ్వ, సంటోల్ల రాజమణి, కొంగల లక్ష్మి, సంటోల్ల లక్ష్మి , సంటోల్ల  సిద్ధవ్వ  పాల్వంచ మండల ఇతర గ్రామాల దళిత సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు గ్రామ యువత పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >