| Daily భారత్
Logo




ఎమ్మెల్యే రాసలీలలా వీడియో కలకలం

News

Posted on 2024-09-05 12:30:44

Share: Share


ఎమ్మెల్యే రాసలీలలా వీడియో కలకలం

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: రాజకీయ నేతలు రొమాన్స్ వీడియోలతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఏ పార్టీ వారైనా.. ఇందులో ఇరుక్కుపోయి తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఓ ఎమ్మెల్యే రొమాంటిక్ టేప్స్ కలకలం రేపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆయనెవరో తెలుసా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.

ఈ వ్యవహారం ఇంటాబయటా హాట్ టాపిక్‌గా మారింది. మత్తు మందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారన్నది బాధితురాలి ఆరోపణ. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది. తనపై చేసిన అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను రిలీజ్ చేసింది.

ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు కోనేటి ఆదిమూలం. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చాడని, వేధింపులు భరించలేక లొంగిపోయానని మనసులోని మాట బయటపెట్టింది బాధితురాలు. ఈ వ్యవహారం తన కుటుంబంలో చిచ్చురేపిందని తెలిపింది. ఆయన వ్యవహారాలు బయటపెట్టేందుకు సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసి మీడియాకు ఇచ్చినట్టు తెలిపింది.

తన ప్రాణానికి హాని ఉందంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది బాధితురాలు. అర్థరాత్రి వేళ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన ఇంట్లో గొడవలు తీవ్రమైనట్లు చెప్పింది. ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గోడు వెల్లబోసుకుంది.

రాసలీలల వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. ఆ వీడియో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలన్నారు.

Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >