Posted on 2026-04-18 10:21:32
డైలీ భారత్, సింహాచలం: నరసింహ స్వామి ఉగ్ర మూర్తి భయం కొలిపేలా ఉంటాడు. కానీ సింహాచలం అప్పన్న స్వామి లో ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు నిరంతరం చందనపు పూత లో దర్శనమిస్తాడు.
స్వామి. ఏడాదికోమారు అక్షయ తృతీయనాడు చందనం పూతను తొలగించి చూస్తే గరుత్మంతుని లాలిస్తూ భక్త రక్షణ కోసం తాపత్రయ పడుతూ కనిపిస్తాడు అప్పన్న స్వామి.
స్వామి వారి చందనోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం..
చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులు చేసే దేవాదిదేవుడు సింహాచలం అప్పన్న స్వామీ.
చందనపు పూత లో స్వామి సుమారు మూడు అడుగుల ఎత్తుతో శివలింగం మాదిరిగా గుండ్రంగా దర్శనమిస్తాడు.
వాస్తవానికి స్వామికి రూపం ఉన్న ఆరూపం అంత చందనంతో కప్పబడి ఉంటుంది సంవత్సరంలో ఒక్కరోజు అంటే అక్షయ తృతీయ రోజు మినహా మిగతా అన్ని రోజులు స్వామివారు చందనం పూత లోనే ఉంటారు దీనిని నిత్యరూపం అని పిలుస్తారు.
ఏడాదికి ఒక రోజు అక్షయ తృతీయ నాడు మాత్రం నిజ రూపంలో దర్శనమిస్తారు.
నిజరూపంలో స్వామివారు వరాహ ముఖంతో మానవ దేహం తో సింహపు తోకతో జూలుతో ఉంటాడు. కుడిచేతి వేళ్ళతో గరుత్మంతునికి అమృతం తాగిస్తూ ఎడమచేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు.
స్వామి కిరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు.
సింహాద్రి అప్పన్న ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఒక స్తంభం దర్శనమిస్తుంది దానికి కప్ప స్తంభం అని పేరు .
స్వామి వారిని దర్శించిన భక్తులు ఈ స్తంభాన్ని కౌగిలించుకోవడం ఇక్కడ ఆచారం .
ఆనాడు శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుడుని రక్షించటానికి వచ్చాడు .
"పవిత్రాణాయ సాధూనాం "సత్పురుషులను రక్షించటానికి వస్తానన్నాడు కృష్ణుని వాగ్దానం ప్రకారం అవతారానికి ప్రధాన లక్ష్యం శిష్టరక్షణ దాని అనుబంధ ప్రయోజనం దుష్టశిక్షణ.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >