| Daily భారత్
Logo




వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి హత్య

News

Posted on 2026-04-18 10:19:45

Share: Share


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి హత్య

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, లక్ష్మి అనే మహిళ భర్తతో కొన్నేళ్ల క్రితం గొడవ పడి విడిపోయింది. ఆమెకు సమీర (8) అనే కూతురు, శ్రావణ్ (5) అనే కొడుకు ఉన్నారు. గత ఆరు నెలలుగా నర్సింహులు అనే వ్యక్తితో లక్ష్మి సహజీవనం చేస్తోంది.

అయితే లక్ష్మి కుమారుడు శ్రావణ్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన నర్సింహులు, బాలుడిని హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు తెలుస్తోంది. ఇంట్లో లక్ష్మి లేని సమయంలో బాలుడి కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి, అనంతరం కర్రతో తలపై బాది నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి లక్ష్మి, నర్సింహులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన సమాజంలో పెరుగుతున్న నేరప్రవృత్తులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసేలా చేసింది.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >