| Daily భారత్
Logo




రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-09-05 16:06:18

Share: Share


రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి  విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, రెడ్డి సేవా సమితి నాయకులు

షాద్ నగర్ లో రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి కొత్వాల్ విగ్రహానికి శ్రీకారం

కార్యక్రమానికి హాజరైన వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు

గాంధీ, గద్దర్ తదితర విగ్రహాల ఏర్పాటు కూడా సుముఖత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ, విద్యా వికాసానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి కొత్వాల్ అని ఆయన సేవలను భవిష్యత్తు తరాలు స్మరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనే ఉద్దేశంతో షాద్ నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్",  మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, సీనియర్ నేత మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డి, రెడ్డి సేవా సమితి షాద్ నగర్ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి,  యువజన సంఘం అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లట్టుపల్లి మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి,  పట్టణంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి కొత్వాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం తరఫున సహకరించేందుకు రెడ్డి సేవ సమితి నాయకులతో  పాటు ఆయా ప్రజా సంఘాల నాయకులు జనార్ధన్ అర్జునప్ప బుచ్చయ్య రామకృష్ణ వెంకటయ్య తదితరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పక్కనే ప్రజా నౌక గద్దర్ గాంధీ మహాత్ముని విగ్రహాలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే l శంకర్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి స్వార్థ చింతన లేకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో గౌరవం అని అన్నారు. రెడ్డి సేవా సమితి ఏర్పాటు చేయ విగ్రహానికి ధనవంతు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి కొత్వాల్ (నేటి నగర పోలీస్ కమీషనర్ స్థాయి పదవి)గా పనిచేసిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి గొప్ప దాతగా, ప్రజాసంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా ప్రతిష్ఠ పొందారని అన్నారు. తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులతో  పాటే సమాజంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే విధంగా చదువుకునేందుకు సహకారంగా ఉండాలని, ఆనాటి నైజాం రాష్ట్రంలో విద్యావికాసానికి ఉపకరిస్తుందని భూమి విరాళం ఇచ్చి రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. రెడ్డి హాస్టల్‌గా పేరుపొందిన హైదరాబాద్ రెడ్డి విద్యార్థి వసతిగృహం నిజాం పరిపాలనకాలం నాటి తెలంగాణలో విద్యారంగం, సాంస్కృతికరంగాలకు విలువైన సేవ చేసిన సంస్థ అని కొనియాడారు. హైదరాబాద్ నగర కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి రెడ్డి హాస్టల్‌ను తన వితరణతో ఏర్పాటుచేశారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, తాండ్ర కాశినాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి విశాల శ్రావణ్ రెడ్డి, పి వెంకట్రామ్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, చెన్నయ్య, ఆగిర్ రవికుమార్ గుప్తా, సరాపు జగదీష్, చెంది తిరుపతి రెడ్డి, రఘు, ముబారక్ ఖాన్, రామారావు, బస్వం, మహమ్మద్ ఇబ్రహీం, ఖాదర్ గోరి, పురుషోత్తం రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,శేఖర్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి బడిరెడ్డి విజయ్ రెడ్డి ,అజయ్ రెడ్డి,అందేమోహన్, సయ్యద్ ఖదీర్, చంద్రశేఖర్, జమ్రుత్ ఖాన్, జంగారి రవి, లింగారెడ్డి గూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >