Posted on 2024-09-08 11:21:11
జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : యూత్ కాంగ్రెస్ జూలూరుపాడు మండల అభ్యర్థి రామిశెట్టి నరేందర్
భారీ వర్షాలు ఉన్నాయి
డైలీ భారత్, జూలూరుపాడు: రాబోయే రోజుల్లో జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రామిశెట్టి నరేందర్ ఒక ప్రకటనను విడుదల చేశారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు.వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, నదులు, చెరువుల వద్దకు చూడటానికి వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని తెలిపారు.వర్షాలు తగ్గే వరకు వ్యవసాయ పనులకు మరియు పశువులు కాయడానికి వెళ్లకుండా ఉండాలని సూచించారు.ఇతర శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసు శాఖ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా వాగులు మరియు నదులలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ఎవరికైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను పొందాలని తెలియజేసారు..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >