| Daily భారత్
Logo




స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ను అభినందించిన ఆది శ్రీనివాస్

News

Posted on 2024-09-08 13:26:07

Share: Share


స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ను అభినందించిన ఆది శ్రీనివాస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 5 సెప్టెంబర్ న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో విశేష కృషిచేసి, వినూత్న ఆలోచనలతో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై పాటుపడిన 41 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం గా పనిచేస్తున్న పాకాల శంకర్ గౌడ్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డును ఈ నెల 5 న హైదరాబాదులోని రవీంద్రభారతిలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్  చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాకాల శంకర్ గౌడ్ ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేసి, ప్రత్యేకంగా అభినందించారు. శంకర్ గౌడ్ 26 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధికి కృషి చేశారని వారి సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించిందని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దే  బాధ్యత టీచర్లపైనే ఉందని ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణకై కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకి పారిశుద్ధ్య కార్మికులను నియమించామని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులకి ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ చందుర్తి మండల బాధ్యులు మొలిగె శంకర్ పాల్గొన్నారు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >