| Daily భారత్
Logo




సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగ తీజ్ : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

News

Posted on 2024-09-08 15:00:49

Share: Share


సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగ తీజ్ : ఎమ్మెల్సీ  నవీన్ కుమార్ రెడ్డి

కేశంపేట మండలం దేవుని గుడి తండాలో తీజ్ వేడుకలు

హాజరైన పలువురు బీఆర్ఎస్ నాయకులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ అని ఎంతో వైభవోపేతంగా గిరిజనులు జరుపుకునే పండుగ అన్ని వర్గాలకు ఆదర్శప్రాయమైనదని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం దేవుని గుడి తండాలో తీజ్ పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు సిసిఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ కొత్తపేట మాజీ సర్పంచ్ నవీన్ ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాబు నాయక్, భూపాల్ రెడ్డి భద్ర నాయక్ నోకియా నాయక్ హటియా నాయక్ రామస్వామి శ్రీరాములు శీను తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో తీజ్ వేడుకలను వీక్షించారు. ఈ సందర్భంగా పండగ విశిష్టతను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొంటూ.. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. వారి ఆచారం ప్రకారం గిరిజన యువతులకు మంచి వరుడు దొరికేందుకు ఈ పండుగలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ పండుగ ముఖ్య ఉద్ధేశ్యం తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం ఆ రోజు తాండ నాయకుని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తాండ నాయక్ ఇతర తాండ పెద్దలను గౌరవించడం. తాండలో వర్షాలు బాగా కురిసి ప్రతి తాండ ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఎప్పుడు పచ్చగా హరిత భరితంగా ఉండడం, పెళ్ళి కాని అమ్మాయిలకు చక్కటి భర్త దొరకాలని అన్ని కోరికలు నెరవేరాలని అమ్మాయిలు కోరుకోవడం ఎంతో సాతిసిద్దంగా ఉంటాయని కొనియాడారు..

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >