Posted on 2024-09-08 15:02:05
గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే ఆటపాట
గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో మమేకమైన ఎమ్మెల్యే శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేశంపేట్ మండలంలోని దేవుని గుడి తండాలో గిరిజన లంబాడి సోదర సోదరీమణులు, అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ వేడుకలతో పాటు వారితో కలిసి ఆటపాటల్లో తనదైన శైలిని ప్రదర్శించారు. గిరిజన ప్రజలతో కలిసి ఆయన చలాకీగా నృత్యం చేశారు.
ఎమ్మెల్యే శంకర్ నృత్యంతో పండుగ వేడుకల్లో ఉత్సాహం హుషారు నెలకొంది. ఈ పండుగను ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఎంతొ వైభవంగా పండుగను జరుపుకోవడం సంతోషకరమని, గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. తిజ్ ను పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారనీ, ప్రతి ఏటా ఆషాడ మాసంలో గిరిజన యువతులు తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో నవధాన్యాల మొలకలకు పూజలు చేయడం ఈ పండగ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ అప్ప, మండల అధ్యక్షులు గూడ వీరేష్ , మాజీ జెడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, గిరి యాదవ్, పర్వతాలు, సురేష్ రెడ్డి, ఆనంద్, రాజేందర్ రెడ్డి, రమేష్, రూప్లా నాయక్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >